ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 12,760 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుమలత తెలిపారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం శివారులో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సుమలత తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని, సంఘటనా స్థలంలో ఉన్న 12,760 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
