నిజామాబాద్ నగర శివారులోని అశోక్ సాగర్ చెరువు కట్టపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన సమాచారం మేరకు..జాన్కంపేట్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ కమల, తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై నిజామాబాద్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ సాగర్ చెరువు కట్ట వద్దకు రాగానే, వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడటంతో, అక్కడికక్కడే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
