గడువు దగ్గరపడుతున్నా క్షేత్రస్థాయిలో జాడలేదుకేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాల్సిన బి ఎల్ వో అలసత్వం వైఖరులు సర్ పక్రియ ఫై నీలి నీడలు కమ్మేస్తున్నాయి.ఇంటికి కి వెళ్లి బోగస్, మృతుల ఏరివేత డబుల్ ఎంట్రీ ఓటర్లను గుర్తించాలి ఫైనల్ గా వోటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలనేది సర్ లక్ష్యం!కానీ కొందరు బీఎల్‌ఓల అనుసరిస్తున్న పనితీరు ఫై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటింటికి వెళ్లాల్సిన కొందరు బి ఎల్ వో లు స్థానికంగా కమ్యూనిటీ హల్ లు లేదంటే చాయ్ హోటళ్లు చుట్టాల ఇండ్ల వద్దే అడ్డాలు వేసి సర్ పక్రియ ను పూర్తీ చేస్తున్నారు. ఒక్కో ఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లాలని ముందే దిశానిర్దేశం చేసారు.
అనేక సవాళ్ల ను అధిగమించైన సరే నిర్దేశించిన నియమావళి మేరకే పనిచెయ్యాలని సాక్ష్యాత్తు కలెక్టర్ స్ఫష్టం చేసారు.డివిజన్ లున్న నిజామాబాద్ నగరంలో 301 మంది బీఎల్‌ఓలు,సర్ పక్రియ కోసం రంగంలోకి దించారు.అంటే ఒక్కో దివిజ కు యావరేజ్ గా అయిదుగురు బి ఎల్ వో లు నియామకం అయ్యారు.
28 మంది ఎస్‌ఓలు, 14 మంది ఏఈఆర్‌ఓలు ను నియమించారు నెలరోజుల్లో నిర్దేశించిన లక్ష్యం పూర్తీ చెయ్యాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి, వాటిని ఎలా నింపాలో వివరించాలి తిరిగి వాటిని తీసుకోవాలి ఈ పక్రియ లో బీఎల్‌ఓలు కచ్చితంగా ఒక్కో ఇంటికి మూడేసి సార్లు వెళ్ళాలి .
ముఖ్యంగా వినాయక్‌నగర్ ఫులాంగ్ వంటి ప్రాంతాల్లో కొందరు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లకుండా బంధువుల ఇళ్లలోనే ఉంటూ అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరికొందరు ఒకేచోట గుంపులుగా కూర్చొని విధులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.
దీంతో ప్రజలు బీఎల్‌ఓలను వెతుక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.ఎన్యూమరేషన్ ఫారాలపై బీఎల్‌ఓల పేర్లు, మొబైల్ నంబర్లు ముద్రించినప్పటికీ, ఫోన్ చేస్తే ఎక్కువ మంది స్పందించడం లేదని బాధితులు చెబుతున్నారు.
ఒకవేళ ఫోన్ ఎత్తినా తెలిసిన వారి వద్ద ఫారం నింపించుకుని తీసుకురండి, సర్వర్ పనిచేయడం లేదు, సాంకేతిక సమస్య ఉంది అంటూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించడంలోనూ జాప్యం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
ఈ ప్రత్యేక సవరణలో 2002 నాటి ఓటరు జాబితా వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన ఓటర్లకు మరింత భారంగా మారింది. 2002 జాబితాలో తమ పేరు ఎలా గుర్తించాలో తెలియక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పీడీఎఫ్ ఫైళ్లలో పాత వివరాలను వెతకడానికి గంటల సమయం పడుతుండగా, చదువుకున్న వారే ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలియని నిరక్షరాస్యులు, వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఫారాలు ఎలా నింపాలి, ఏ పత్రాలు జతచేయాలి, 2002 జాబితాలో పేరు లేకపోతే ఓటు హక్కు కోల్పోతామా వంటి ప్రశ్నలకు బీఎల్‌ఓలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని పలువురు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు బీఎల్‌ఓలకే ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడం సమస్యలను మరింత పెంచుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
బీఎల్‌ఓల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా క్షేత్రస్థాయిలో సమర్థంగా పర్యవేక్షించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం లక్ష్యానికి భిన్నంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రక్రియగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ గడువు ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలను పూర్తిస్థాయిలో విధుల్లోకి దింపడంతో పాటు, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అర్హులైన ఓటర్లు జాబితాలో చేరకుండా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
