అతివేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది.మూడవ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టేవారు నవీన్ (25) తన స్కూటీపై వెళ్తుండగా, రిలయన్స్ బైపాస్ వైపు నుంచి అర్సపల్లి వైపునకు అతివేగంగా, అజాగ్రత్తగా దూసుకువచ్చిన లారీ నవీన్ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు నవీన్ కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
