HomeCRIMEరౌడీషీటర్‌పై పీడీ యాక్ట్.. ఏడాది పాటు జైలుకు

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్.. ఏడాది పాటు జైలుకు

నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న ఓ ప్రమాదకర రౌడీషీటర్‌పై హైదరాబాద్ కుల్సుంపురా పోలీసులు పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్‌ను ప్రయోగించారు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ అధికారులు గురువారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను అమలు చేసి నిందితుడిని ఏడాది పాటు జైలుకు తరలించారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం.. చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ కల్లు కాంపౌండ్ ఎదురుగా నివాసముంటున్న బగిడి ఆకాష్ అలియాస్ ఆకాష్, శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

చత్రినాక పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన ఇతనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. పలుమార్లు అరెస్టై జైలు శిక్ష అనుభవించినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ కాగా, గురువారం కుల్సుంపురా పోలీసులు వాటిని అమలు చేసి చట్టపరమైన ప్రక్రియ పూర్తి అనంతరం నిందితుడిని ఒక సంవత్సరం కాలానికి జైలుకు తరలించారు.

ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments