నిజామాబాదు చేనేత సహకార సంఘం ఎన్నికల తుదిఘట్టం ముగిసింది.చేనేత సంఘం అద్యక్షురాలిగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు.నిజామాబాదు చేనేత సహకార సంఘం ఎన్నికలు మంగళవారం నగరంలోని చేనేత సంఘ భవనంలో జరగగా డైరెక్టర్లుగా గెలుపొందిన వారు గురువారం అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి, కోశాధికారి,ఉపాద్యక్షులను ఎన్నుకున్నారు .
నాలుగు పదవులకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగాయి..ఉపాద్యక్ష పదవికి మూడు నామినేషన్లు దాఖలు కాగా మిగిలిన పదవులకు రెండు నామినేషన్ల చొప్పున దాఖలయ్యాయి. అధ్యక్ష పదవితో పాటు ఉపాద్యక్ష పదవికి కూడా నామినేషన్ వేసిన డైరెక్టర్ గుద్దేటి రామకృష్ణ ఉపాద్యక్ష పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్నారు..దీంతో మొత్తం నాలుగు పదవులకు గానూ ఇద్దరు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు..మొత్తం నాలుగు పదవులకు ఎన్నికలు జరగగా డైరెక్టర్లు అద్యక్షురాలిగా గుజ్జ రాజేశ్వరిని ఎన్నుకున్నారు.
ఉపాద్యక్షులుగా అవదూత విఠల్,ప్రధాన కార్యదర్శిగాపెంటి రాజు,కోశాధికారిగా నందాల నరేష్ ఎన్నికయ్యారు.మొత్తం తొమ్మిది మంది డైరెక్టర్లకు గానూ తొమ్మిది మంది ఎన్నికలో పాల్గొన్నారు.విజయం సాదించిన అభ్యర్థులకు ఐదు చొప్పున ఓట్లు రాగా ఓటమి పాలైన అభ్యర్థులకు నాలుగు చొప్పున ఓట్లు పడ్డాయి.
ఎన్నికల అధికారిగా జిల్లా సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్ పోషన్న వ్యవహరించారు. చేనేత కార్మికుల సంక్షేమం చేనేత రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అద్యక్షురాలిగా ఎన్నికైన గుజ్జ రాజేశ్వరి ఈ సందర్భంగా చెప్పారు..అనంతరం సంఘ కార్యాలయం వద్ద జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు దీకొండ యాదగిరి,వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు,ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్,పద్మశాలిహాస్టల్ ప్రధాన కార్యదర్శి, గంట్యాల వెంకట్ నర్సయ్య,చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బింగి ధరంవీర్, జిల్లా అద్యక్షులు తన్నీరు శ్రీనివాస్జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు తులసి,విష్ణువర్దన్,పెంటి రవి, సురుకుట్ల విజయ్,రాపెల్లి రాజు,ఎల్.దేవీదాస్,తదితరులు పాల్గొన్నారు.. ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
