బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు.. అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, మొక్కలు నాటే కార్యక్రమం విశేష స్పందన లభించింది. యువత, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ పలు మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీజీ గౌడ్ విచ్చేశారు.ఆయనతో పాటు మాజీ జడ్పీ ఛైర్మన్ విట్టల్ రావు, జడ్పీటీసి సంతోష్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు సత్య ప్రకాష్, సుజిత్ ఠాకూర్ తదితరులు హాజరై మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
అలాగే బీఆర్ఎస్ యువజన నాయకులు అల్లరి ప్రశాంత్, సంతు, సాయి గౌడ్ తదితర యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు.
