HomeTelanganaNizamabadఅనాథ మృతదేహానికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు..ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవాభావం..

అనాథ మృతదేహానికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు..ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవాభావం..

పోలీసుల సమక్షంలో నిర్వహణగుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి బంధువులు, సంబంధీకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో అనాథగా నిర్ధారించిన మృతదేహానికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు దేవి థియేటర్ సమీపంలోని సార్వజనిక శ్మశానవాటికలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు మాట్లాడుతూ, దిక్కులేని మృతదేహానికైనా చివరి గౌరవం దక్కేలా చూడడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

మానవత్వాన్ని చాటే ఇలాంటి సేవా కార్యక్రమాలను సంస్థ తరచూ కొనసాగిస్తుందని తెలిపారు.ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మాట్లాడుతూ, అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యకార్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ప్రతినిధులు వాల బాలకిషన్, కొండా నాగేందర్, సుధాకర్, వినయ్, రాజు, అఫ్రోజ్, దర్శనం రాజు, సాయి, మొదటి టౌన్ పోలీస్ సిబ్బంది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments