చైన్ స్నాచింగ్ లకు పాల్పడి రైల్ లో నాలుగు జిల్లాలు ధాటి పారిపోతున్న ముఠా ను ఇద్దరు ఏసీపీలువెంటాడారు. కాసేపట్లో మహారాష్ట్ర లో అడుగుపెట్టబోతున్న ఆ ముఠా అజంతా ఎక్స్ ప్రెస్ రైల్ లో బాసర స్టేషన్ లో ఎట్టకేలకు చిక్కింది. సినిమా పక్కి లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.
శాద్‌నగర్–కడ్తల్ ప్రాంతాల్లో బైక్‌ల చోరీతో పాటు రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడినముఠా కదలికలు అజంతా ఎక్స్ ప్రెస్ రైలు గుర్తించిన షాద్ నగర్ పోలీసులు నిజమాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తం అయిన సీసీ యస్ ఏసీపీ శ్రీశైలం తో పాటు నగర ఏసీపీ ప్రకాష్ యాదవ్ లు భారీ బలగాలతో రాత్రి పది గంటలకు నిజామాబాద్ వచ్చిన ఆ రైల్ లో ఎక్కారు.
కానీ ఆ ముగ్గురు నిందితులను గుర్తించడం క్లిష్టంగా మారింది ఈలోపు రైల్ కూడా నవీపేట్ దాక వెళ్ళింది . ఈ క్రమంలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బాసర లో స్టేషన్ లోదించేశారు . వారి వద్ద నుంచి చైన్ స్నాచింగ్‌లో అపహరించిన రెండు బంగారు చైన్లు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అప్రమత్తత, జిల్లాల మధ్య సమన్వయంతో నిందితులను వేగంగా పట్టుకోవడం గమనార్హం.
