నగరంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరపండగ వేడుకలు నేపథ్యంలో సందర్భంగా ఎల్లమ్మ గుట్ట వద్ద మున్నూరు కాపు కమిటీ సభ్యులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ గుట్ట కమాన్ వద్ద బండారి వేడుకను నిర్వహించారు.
గ్రామ దేవతలకు పూజలు చేసి, ఊరికి శాంతిని, సుభిక్షాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలో 45వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాలుపంచుకుని పండగ వాతావరణాన్ని మరింత శోభాయమానం చేశారు.
