నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు పరిపాలనా, ఆర్థిక అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి, ఇప్పటికే ఆమోదం పొందిన పనులను వేగవంతం చేయాలనే లక్ష్యం తో జిల్లా నేతలు ఢిల్లీ బాట పట్టారు. వచ్చే రైల్వే బడ్జెట్ లో జిల్లాకు ప్రాధాన్యత దక్కించుకోవడానికి జిల్లా నేతలు ఈసారి ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే మార్చ్ వచ్చే బడ్జెట్ లో ప్రతిపాదనలు నిధుల కేటాయింపు జరగాలంటే ఆరు నెలల ముందే అర్జీ లు ఇవ్వాలి. ఇందులో భాగంగా ఎంపీ అర్వింద్ తో కల్సి ఆర్మూర్ అర్బన్ ఎమ్మెల్యే లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంగళవారం న్యూఢిల్లీలో కల్సి పెండింగ్ చిట్టా విప్పారు ఎంపీ అరవింద్ ఈసారి మరిన్ని వంతెనల కోసం పట్టుపడుతున్నారు ఇప్పటికే అర్సపల్లి ,మామిడిపల్లి, మాదవనగర్.బోధన్ వంతెనలు మంజూరు కాగా నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) మంజూరు చేయడంతో పాటు, డిచ్‌పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు నివారించి ప్రయాణికుల భద్రత మరింత మెరుగుపడుతుందని ఎంపీ అంటున్నారు . ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. సంబంధిత అధికారులతో ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల ఇందల్వాయి, జానకంపేట వద్ద నూతన రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్ ధర్మపురి కృతజ్ఞతలు తెలిపారు/// ఆర్మూర్ –ఆదిలాబా–ఫై సానుకూలత /// దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఆర్మూర్-అదిలాబాద్ వయా నిర్మల్ మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు .దీనిపై మంత్రి సానుకూలత వ్యక్తం చేసారు అలాగే ఆర్మూర్ నుండి హైదరాబాద్ వయా డిచ్ పల్లి మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే అర్బన్ లోనూ రెండు చోట్ల వంతెనలు మంజూరు చెయ్యాలని దన్ పాల్ సైతం రైల్వే మంత్రి కోరారు సోని ఫంక్షన్ హల్ కొత్త వంతెన అలాగే బస్టాండ్ వద్ద ఉన్న వంతెన ను మరింత విస్తరించాలని ఆయన ప్రతిపాదించారు.ఎంపీ తో కలిసి ఇద్దరు ఎమ్మెల్యే లు చేసిన పలు ప్రతిపాదనల్లో కేంద్రం ఏ ఏ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి
రైల్వే ప్రాజెక్టులఫై ఆశలు ….ఢిల్లీ బాట పట్టిన నేతలు ……ఆర్మూర్-ఆదిలాబాద్ లైన్ ఫై సానుకూలత ……మరిన్ని వంతెనల కోసం ప్రతిపాదనలు…
RELATED ARTICLES
