HomeTelanganaNizamabadఆర్డీవో రాజేంద్రకుమార్‌కు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి.

ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి.

.నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో)గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రకుమార్‌ను స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో పదోన్నతి పొందిన అధికారులకు తక్షణ బదిలీలు చేపట్టే అవకాశం లేదు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం వారికి కొత్త పోస్టింగ్‌లు, బదిలీలు ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాజేంద్రకుమార్‌ నిజామాబాద్ ఆర్డీవోగా ఎన్నికల నిర్వహణ, రెవెన్యూ పరిపాలనతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆయనకు పదోన్నతి లభించడంతో జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

పదోన్నతి ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముగిసిన తర్వాతే రాజేంద్రకుమార్‌కు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చి బదిలీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments