Friday, April 24, 2026
HomeCRIMEకొండ ను తవ్వి ఎలుకను పడుతున్న టాస్క్ ఫోర్స్ ......మట్కా ...బెట్టింగ్....పిడియస్ గంజాయి ......జూదం ...

కొండ ను తవ్వి ఎలుకను పడుతున్న టాస్క్ ఫోర్స్ ……మట్కా …బెట్టింగ్….పిడియస్ గంజాయి ……జూదం దందా ల వైపు కన్నెత్తి చూడని వైనం …….

రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండే జిల్లాలో అనేక దందా లకు అనువైన అడ్డాగా మారుతుంది. వరస ఎన్నికల నిర్వహణలో పోలీసు ఉన్నతాధికారులు క్షణం తీరిక లేని నేపథ్యంలో మూడో కన్ను తెరిచి పంజా విసరాల్సిన టాస్క్ ఫోర్స్ దిక్కులు చూస్తూ కాలక్షేపం చేస్తుంది.

నేరస్తలకు కంటి మీద కునుకు లేకుండా చేయాల్సింది కానీ ఆ వ్యవస్థే మొద్దు నిద్ర లో జారుకుంది. గతంలో కరుగట్టిన నేరస్తులను వెంటాడి వణుకు పుట్టించిన టాస్క్ ఫోర్స్ గత కొద్దీ కాలంగా మొక్కుబడి దాడులతో సరి పెట్టుకుంటుంది.

T 2020 ప్రపంచ కప్ తాలూకు క్రికెట్ బెట్టింగ్ లు జిల్లా కేంద్రంలోనే యథేచ్ఛగా సాగుతున్నాయి. బెట్టింగ్ భూతం అనేక మంది దిగువ మధ్యతరగతి యువత జీవితాలను కబళిస్తున్నాయి. అప్పులతో బెట్టింగ్ అనేక కుటంబాలు ఆర్థికంగా ఛిద్రం అవుతున్నాయి.

ఎక్కడెక్కడ ఈ బెట్టింగ్ దందాలు సాగుతాయో టాస్క్ ఫోర్స్ కు పక్కాగా తెలుసు కానీ ఆవైపు కన్నెత్తి చూడరు. కానీ బతుకు దెరువు కోసం ఒళ్ళు అమ్ముకొనే దందాల మీద గుంపులుగా వెళ్ళి విరుచుకపడుతారు. ఎహే దాడులు చేయడమే మా పని తదుపరి దర్యాప్తు అంతా లోకల్ పోలీస్ దే అంటారు.

పోనీ ఆ దందాల మూలాల లకు వెళ్ళి అమ్మాయి ల అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేస్తారా అది లేదు. గతంలో ఆయా మాఫియా లు స్థానిక పోలీసులకన్న టాస్క్ ఫోర్స్ అధికారులను చూసే వణికి పోయేది. వారి నిఘా నుంచి తప్పించుకునే ఎత్తుగడలు వేసేది.

అయినప్పటికి పక్క సమాచారం తో దాడులు జరిగేవి. కానీ గతమెంతో ఘనంగా ఉన్న టాస్క్ ఫోర్స్ లో ఇప్పుడు మునుపటి వేగంగా కొరవడింది. అందుకే కొండను తవ్వి ఎలుక ను పట్టే చందంగా దాడులు చేస్తూ చేతులు దులుపు కుంటున్నారు.కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో ఉండేది .

ఎస్బి తరవాత టాస్క్ ఫోర్స్ విభాగమే.అందుకే డిఎస్పీ స్థాయి అధికారి తో పాటు ఇద్దరు సీఐ లను కేటాయించారు. పటిష్టమైన సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకొని వ్యవస్థి కృత నేరాల నియంత్రణ లో క్రియాశీలకంగా పనిచేయాలి.

వ్యవసాయ పంటల సాగులో దేశానికే ఆదర్శంగా ఉండే జిల్లా అనేక కరుడుగట్టిన నేరాలకు అడ్డాగా మారింది. గంజాయి …మట్కా …బెట్టింగ్ …పీడీఎస్ బియ్యం …..జూదం దందాలు యధేచ్చగా సాగుతున్నాయి.

ఇదివరకు ఈ దందాలు చేసే వారు ఒకరిద్దరే వుండేది. కానీ ఇప్పుడు ఒక్కో దందాలో డజన్ల కొద్దీ మంది రాటుదేలి పోయి పనిచేస్తున్నారు. అందుకే ఆయా నేరాల ను నియంత్రించడం పోలీసులకు దుస్సాధ్యంగా మారింది.

దీనికి తోడు పరుగులు పెట్టి పనిచేయాల్సిన టాస్క్ ఫోర్స్ లాంటి వ్యవస్థ నిస్సహాయంగా వ్యవహరిస్తోంది .

అందుకే ఆయా నేరాలు మరింత విస్తరిస్తున్నాయి. గతంలో జిల్లాకేంద్రంతో పాటు బోధన్ ఆర్మూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో నే ఆయా నేరాల ఉనికి కనిపించేది.

కానీ ఇప్పుడు కమ్మర్ పల్లి సిరికొండ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ బెట్టింగ్ …పీడీఎస్.. జూదం మాఫియా చెలరేగిపోతుంది.

పసుపు పంట తో ప్రపంచ ఖ్యాతి పొందిన ఆర్మూర్ ప్రాంతంలో గంజాయి ..జూదం లాంటి దందాల చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి.

గ్రామాభివృద్ధి కమిటిల ఫై గతంలో ఎన్నడూ లేని విధంగా కమిషనర్ ఉక్కుపాదం మోపుతుంటే ఆర్మూర్ ప్రాంతంలో ఇలాంటి చిన్న చితక నేరాల ను నియంత్రించడంలో టాస్క్ ఫోర్స్ లాంటి వ్యవస్థ మీన మేషాలు లెక్కిస్తుంది.

జిల్లాకేంద్రంలోమట్కా ..గంజాయి ..బెట్టింగ్ .దందాలు యధేచ్చగా సాగుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టుగా సాగుతూనే ఉంది. గంజాయి చెలామణి నగరంలో అనూహ్యంగా విస్తరిస్తుంది. గంజాయి కి యువత బానిస అవుతున్నారు.

పటిష్టమైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకొని నిర్దిష్టమైన కార్యాచరణ తో నిరంతరం ఉక్కుపాదం మోపితే నే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!