వ్యభిచార గృహాలపై టాస్క్ ఫోర్స్ బృందం దాడి…4గురు మహిళలు అరెస్టు..వ్యభిచార గృహాలపై పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా దాడి చేసిన ఘటన శనివారము నగరంలో మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలు మరియు ఒక నిర్వాహకులురాలు టాస్క్ ఫోర్స్ బృందం మరియు పోలీస్ సంయుక్తంగా కలిసి దాడి చేశారు.
మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని గౌతమ్ నగర్కు చెందిన ఒక నియోజకవర్గాలు ముగ్గురు మహిళలు కలిసి వ్యభిచారం నడిపిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు శనివారం దాడి చేసి వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
వారి నుంచి నాలుగు సెల్ ఫోన్లు పదివేల రూపాయలు నగదు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నలుగురు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ వెల్లడించారు.