HomePOLITICAL NEWSkamareddyఉదృతంగా ప్రవహిస్తున్న తిర్మన్ పల్లి తండా వాగు......నిలిచి పోయిన రాకపోకలు ; పిల్లల...

ఉదృతంగా ప్రవహిస్తున్న తిర్మన్ పల్లి తండా వాగు……నిలిచి పోయిన రాకపోకలు ; పిల్లల చదువులు గ్రామస్తుల పనులకు ఆటంకం

సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామం నుండి తండా వరకు మంగళవారం ఉదయం రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సోమవారం సాయంత్రం నుండి కురుస్తున్న ఏకధాటి వర్షానికి గ్రామం నుండి తండాకు వెళ్లే దారిపై ఉన్న అలుగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రతి వర్షాకాలంలో తమకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో తండాలో నివాసం ఉంటున్న 20 కుటుంబాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. గతేడాది సైతం ఏకధాటి వర్షాలతో రాకపోకలు నిలిచిపోగా విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడిందని చెబుతున్నారు.

తిర్మన్ పల్లి మరియు తిర్మన్ పల్లి తండా కు అనుసంధానమైన ఈ ప్రధాన రహదారిపై తుంగ చెరువు ఆగు పై నిర్మించిన అలుగు చిన్నదిగా ఉండడంతో వర్షాలు అధికంగా కురిసినప్పుడు నీరు పైనుండి ప్రవహిస్తుంది అంటున్నారు. తండా ఏర్పాటు సమయం నుండి ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని తాండవాసులు అంటున్నారు.

అధికారులు ప్రజా ప్రతినిధులు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమకు ఆటంకం లేని ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అలుగు చిన్నగా ఉండడంతో ప్రతి సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్ లాల్ సింగ్ తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు అలుగుపై నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుందని దీంతో తమతాండాలోని ఇరవై కుటుంబాలు ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాయని అన్నారు.

గ్రామానికి తాండకు ప్రధాన రహదారి దృష్టి తిని గతంలో పంచాయతీరాజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మరమ్మత్తులకు 10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు అన్నారు. వాటితో ఎలాంటి పనులు చేపట్టలేదని అలుగు పెద్దదిగా ఉండడంతో పది లక్షల తో మరమ్మత్తు పనులు కాకుండా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments