HomeCRIMEఅప్పుల బాధతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

అప్పుల బాధతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోపాల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోపాల్ మండలం బాడ్సీ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల దశరథ్ (32) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే, గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పాటు అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి.అప్పుల బారం ఎక్కువై తీవ్ర మనోవేదనకు గురైన కిషోర్… సోమవారం రోజున మంచిప్ప చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

స్థానికుల సమాచారం ద్వారా ఈ ఘటనపై స్పందించిన మోపాల్ ఎస్ఐ సుస్మిత వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments