తెలంగాణ ఈగల్ ఫోర్స్ బుధవారం ఏకంగా యూనివర్సిటీ లోనే సోదాలు చేసింది.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి క్యాంపస్‌లో మత్తు పదార్థాలు చెలామణి విచ్చల విడిగా సాగుతుందనే సమాచారం మేరకు ఈగల్ ఫోర్స్ రంగంలోకి దిగింది అనుమానం ఉన్న పలువురు విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు గా ప్రాథమిక సమాచారం ఇంకా ఈగల్ టీం నుంచి నిర్ధారణ కాలేదు. వర్సిటీ పరిధిలో అక్రమంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు అస్సాం రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఒక్కో గ్రాము గంజాయిని రూ.500లకు విక్రయిస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది గంజాయి దందా ముఠా మూలలను గుర్తించడానికి ఈగల్ టీం సైతం ఇప్పటికే రంగంలోకి దిగింది
