HomeTelanganaNizamabadగిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన..

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన..

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంతో పాటు, కళాశాలలో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

ఆధునిక వసతులతో తరగతి గదులు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థులకు మరింత అనుకూలమైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కవిత తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments