యాదాద్రి భువనగిరి జిల్లా. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారుకంపెనీలోని సి-బ్లాక్‌లో నైట్ షిఫ్ట్‌లో 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.
రియాక్టర్ వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు.
పేలుడు ధాటికి పెద్దవూర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్న బోయిన నరేష్‌కుమార్ మృతి చెందారు.
