రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మెమోరాండం సమర్పించేందుకు వెళ్లిన బీజేపీ నాయకుల బృందాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి నేతృత్వంలో నాయకులు మంత్రికి వినతిపత్రం అందించేందుకు వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అనంతరం బీజేపీ నాయకులను అరెస్టు చేసి మాక్లూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
