మోస్రా మండలం లోని గోవుర్ అటవీ శివారు లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం గోవుర్ వచ్చిన అటవీ అధికారులు పంట పొలాల్లో ఉన్న అడుగులు చిరుతవే నని నిర్దారించారు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు ఓ వారం పాటు పొలాలకు వెళ్లోద్దని కోరారు అత్యవసరం అయితే జాగ్రత్తలు తీసుకోని వెళ్లాలని వారు కోరారు
