HomeCRIMEయన్ ఐ ఏ సోదాలు .......రామగుండం లో కలకలం .......అదుపు లో యువకుడు

యన్ ఐ ఏ సోదాలు …….రామగుండం లో కలకలం …….అదుపు లో యువకుడు

ఉగ్ర కార్యకలాపాల సమాచారం మేరకు యన్ ఐ ఏ అధికారులు పెద్దపల్లి జిల్లా రామగుండం లో సోమవారం తెల్లవారు జామున సోదాలు చేసారు. అయితే సోదాలు చెయ్యడానికి గుజరాత్‌ నుంచి వచ్చారు.

వారు కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తో రావడం కలకలం రేపింది.స్థానిక పోలీసులసమక్షంలోనే ఈ సోదాలు చేసారు.. రామగుండానికి చెందిన ఓ యువకుడు ప్రస్తుతం పెద్దపల్లిలో డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు.

అతని టెలిగ్రామ్‌ గ్రూపులోని వ్యక్తులు, వారి మధ్య చట్ట వ్యరేతిక కార్యకలాపాలపై జరిగిన ఆన్‌లైన్‌ సంభాషణలు, యువకుడికి ఉన్న సంబంధాలపై సమాచారం రావడంతో ఉదయాన్నే అధికారులు రంగంలోకి దిగారు. టెలిగ్రామ్ గ్రూపులోకి వ్యక్తుల వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.

ముఖ్యంగా టెలిగ్రామ్‌లోని వ్యక్తులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. తనిఖీల అనంతరం అతడికి సంబంధించిన డిజిటల్‌ పరికరాలను అధికారులు పరిశీలించి, ల్యాప్‌టాప్‌, ఫోన్ సహా అన్నీ స్వాధీనం చేసుకున్నారు వివరాలు చెప్పడానికి నిరాకరించారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments