తమకు పాఠాలు చెప్పడానికి సార్లు కావాలంటూ విద్యార్థులు కదం తొక్కారు కాలేజీ నుంచి నేరుగా వెళ్లి ఆర్డీవో కార్యాలయం ఎదుటబైఠాయించారు.సోమవారం ప్రజావాణి వుండడంతో ఆఫీస్ లోనే ఉన్న ఆర్డీవో విద్యార్థులను సముదాయించారు.
బాన్స్ వాడ పట్టణంలో ని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో గత కొన్నేళ్లుగా అధ్యాపకులు లేక పోవడంతో ప్రతియేటా అనేక మంది ఇంటర్ పేయిల్ అవుతున్నారని వారు ఆవేదన చెందారు అనేక సార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు ముఖ్యంగా సివిక్స్, జువాలజి అధ్యాపకులను ఏర్పాటు చేయాలని, క్లాసులు అర్థమయ్యేలా బోధించాలని వారు డిమాండ్.
చేసారు జువాలజీ లెక్చరర్ రెండేళ్లుగా లేక పోయిన బైపీసీ లో అడ్మిషన్ లు తీసుకోని తమ భవిష్యతు తో ఆడుకుంటున్నారని అందుకే గత ఏడాది అనేక మంది ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారు గుర్తు చేసారు.
సివిక్స్ లెక్చరర్ అందుబాటు లో ఉన్నాసరే ఆయన చెప్పే పాఠాలు ఎవ్వరికి అర్థం కావడం లేదన్నారు కాలేజీ లో ఇతర మౌలిక సదుపాయాలు లేక పోయిన కనీసం లెక్చర్లను ఏర్పాటు చెయ్యాలని కోరారు ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు
