ముగించుకొని సోమవారం హైదారాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన కీలక నేతలతో వరుస గా సమావేశం అవుతున్నారు మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై .
సుదీర్ఘంగా చర్చించారు మరో వైపు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి నేతృత్వంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కమిటీ, ఈ వ్యవహారంపై కీలక నివేదికను సిద్ధం చేసి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్‌తో పాటు పీసీసీ (PCC)కి అందజేయనుంది.అందుకే సీఎం రేవంత్ రెడ్డి కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. అనంతరం క్రమశిక్షణ కమిటీ సభ్యులు మరొకసారి అన్‌ఫార్మల్ (అనధికారిక) సమావేశమై సురేఖ కుమార్తె సుష్మిత మాట్లాడిన వీడియో ఆధారాలు, మీడియా సమావేశాల క్లిప్పింగులను సునిశితంగా పరిశీలించారు.ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తో సమావేశం అయ్యారు
