మరికాసేపట్లో నిజామాబాద్ నగరానికి చేరుకోనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు. గవర్నర్ పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ మేరకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి సుభాష్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు.అనంతరం బోర్గాం ఎఫ్‌సీఐ కాలనీలో డిచ్‌పల్లి–నిజామాబాద్ రోడ్డులోని నేషనల్ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకుంటారు.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి 11 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఒంటి గంట వరకు పసుపు రైతులతో ముఖాముఖి, మార్కెట్ లింకేజీ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.40 గంటలకు నేషనల్ పసుపు బోర్డు నుంచి బర్దిపూర్ ధర్మారం సమీపంలోని పీహెచ్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు బయలుదేరి 1.50 గంటలకు అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.50 నుంచి 2.50 గంటల వరకు అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
ఈ కార్యక్రమాన్ని అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పీహెచ్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఐడీఓసీ హెలిప్యాడ్‌కు బయలుదేరి 3.15 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 3.20 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేటకు బయలుదేరి సాయంత్రం 4.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
