HomeTelanganaNizamabadఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2పై కాంగ్రెస్‌ శ్రేణులకు దిశానిర్దేశం..

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2పై కాంగ్రెస్‌ శ్రేణులకు దిశానిర్దేశం..

అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలి: జంగా రాఘవరెడ్డినిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ డీసీసీ టౌన్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.

కార్యక్రమానికి నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎస్‌ఐఆర్‌ కోఆర్డినేటర్‌, తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-1లో సక్రమంగా పనిచేయని సూపర్‌వైజర్లు, బీఎల్‌ఏల స్థానంలో కొత్తవారిని నియమించాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సమన్వయంతో ఎలక్టోరల్‌ రోల్‌, ఏఎస్‌డీడీ డేటాను సేకరించి మండల పార్టీ అధ్యక్షులకు అందజేయాలన్నారు.

వారు ఆ సమాచారాన్ని బీఎల్‌ఏలకు అందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు.సేకరించిన వివరాలను పీసీసీ అధ్యక్షుడు అందించిన నిర్దేశిత టేబుల్‌లో పూర్తిస్థాయిలో నమోదు చేసి సమర్పించాలని తెలిపారు. అర్హత కలిగిన కొత్త ఓటర్లను గుర్తించి ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ నెల 27న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త గ్రామ, వార్డు సభలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని రాఘవరెడ్డి పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్‌ అధ్యక్షులు, మాజీ డివిజన్‌ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ఎస్‌ఐఆర్‌ సూపర్‌వైజర్లు, బీఎల్‌ఏలు, సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments