ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ని పార్టీ నుంచి ఎంఐఎం అధిష్టానం బహిష్కరించింది. తక్షణమే ఎమ్మెల్సీ పదవికి సైతం . వెంటనే శాసనమండలి చైర్మన్‌కు తన రాజీనామాను సమర్పించాలని ఆదేశించింది.
ఈ మేరకు గత అర్ధరాత్రి 12 గంటలకు ఏఐఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ ఆదేశాలు జారీ చేశారు. రహ్మత్ బేగ్‌పై ఇంత కఠిన చర్య ఎందుకు తీసుకున్నారన్నదానిపై మాత్రం పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు.
