వ్యక్తి అరెస్టుబోధన్ పట్టణానికి గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని బోధన్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బోధన్ పట్టణానికి గంజాయి సరఫరా చేసేందుకు ఓ వ్యక్తి టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై వస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి చెక్‌పోస్టు వద్ద నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ధర్మాబాద్ తాలూకాకు చెందిన లక్ష్మణ్ గంగగిరి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.
అతని వద్ద సుమారు 4 కిలోల గంజాయి లభించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
