HomeCRIMEఅక్రమ పీడీఎస్‌ బియ్యం పట్టివేత

అక్రమ పీడీఎస్‌ బియ్యం పట్టివేత

పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడింది. పాపులర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా తరలిస్తున్న 25 కిలోల బరువున్న 300 బస్తాల బియ్యాన్ని అధికారులు గుర్తించినట్లు సమాచారం.

మొత్తం సుమారు 7,500 కిలోల (7.5 టన్నుల) బియ్యం ఉన్నట్లు తెలిసింది.ఒకటవ టౌన్‌ పరిధిలోని ఓ ప్రాంతం నుంచి ఈ బియ్యాన్ని రవాణా చేస్తున్నట్లు సమాచారం.

పాపులర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి తరలిస్తున్నారు.. దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments