నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ఆరో టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ట్రాలీ ఆటోలో సుమారు 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
ట్రాలీ ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బియ్యానికి సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు. బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారు..
దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన బియ్యం విలువ, ఇతర వివరాలను అధికారులు విచారణ అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.
