HomeCRIMEకవితా సభలో.. దుండగుల చేతివాటం!ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

కవితా సభలో.. దుండగుల చేతివాటం!ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

కవిత సభకు జనం పోటెత్తారు.. ఇదే అదనుగా గుర్తుతెలియని దుండగులు చేతివాటం ప్రదర్శించారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన సభలో అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో రద్దీని ఆసరాగా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. పలువురి మెడల్లోని బంగారు గొలుసులను అపహరించినట్లు తెలుస్తోంది.

ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభా ప్రాంగణంలోనే కాకుండా బోర్గాం బ్రిడ్జి వద్ద కూడా పిక్‌పాకెటింగ్‌ జరిగినట్లు సమాచారం ఈమేరకు 4వ టౌన్పోలీసులుకేసునమోదుచేసిదర్యాప్తుచేస్తున్నారు.. అదేవిధంగా డిచ్‌పల్లి ఇందల్వాయి ప్రాంతంలోనూ దుండగులు చోరీలకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం అందింది.

ఒకే రోజు రద్దీ ప్రాంతాలను ఎంచుకుని వరుసగా చేతివాటం చూపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సభా ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తూ నిందితులను గుర్తించేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments