HomeTelanganaHyderabadపోలీసులకు ఉమేశ్‌చంద్ర నిత్య స్ఫూర్తి27వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.. హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌

పోలీసులకు ఉమేశ్‌చంద్ర నిత్య స్ఫూర్తి27వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.. హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌

నీతి, నిజాయితీ, ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలిచిన దివంగత ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌చంద్ర గొప్ప పోలీసు నాయకుడని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశం గర్వించదగ్గ పోలీసు అధికారిగా ఆయన సేవలందించారని కొనియాడారు.

పోలీసులకు ఉమేశ్‌చంద్ర నిత్య స్ఫూర్తి అని పేర్కొన్నారు.ఉమేశ్‌చంద్ర 27వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి సీపీ వీసీ సజ్జనర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు వ్యవస్థకు, సమాజానికి ఆయన అందించిన విశిష్ట సేవలు, చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో డీజీపీ (ఆపరేషన్స్‌, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌) డాక్టర్‌ అనిల్‌కుమార్‌తో పాటు ఉమేశ్‌చంద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉమేశ్‌చంద్రతో కలిసి కొంతకాలం పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని సజ్జనర్‌ తెలిపారు.

ఆయన తల్లిదండ్రులు, సోదరుడు, కుటుంబ సభ్యులతో తనకు ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఉమేశ్‌చంద్ర విధులు నిర్వర్తించిన వరంగల్‌, కడప, పులివెందుల తదితర ప్రాంతాల్లో తాను పనిచేశానని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ ఆయన నిజాయితీ, సమర్థ పాలనను గుర్తుచేసుకుంటూ గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని సజ్జనర్‌ అన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు నెలకొనడానికి ఉమేశ్‌చంద్ర వంటి ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలే కారణమని పేర్కొన్నారు.

ఉమేశ్‌చంద్ర చూపిన కర్తవ్యనిష్ఠ బాటలో పయనిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమేశ్‌చంద్రకు ఘన నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments