HomeTelanganaNizamabadరెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమణ్‌రెడ్డి

రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమణ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (TRESA) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రమణ్‌రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఆయనకు కీలక బాధ్యతలు దక్కడంపై రెవెన్యూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా TRESA అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రమణ్‌రెడ్డి చొరవ చూపారు. ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేలా రూ.కోటి ఇన్సూరెన్స్‌ సౌకర్యం కోసం కృషి చేశారు.

ప్రతి రెవెన్యూ ఉద్యోగికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందేలా కీలకంగా వ్యవహరించారు. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమంతోపాటు సామాజిక సేవకు ప్రాధాన్యమిస్తూ ‘హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌’ను స్థాపించారు. ఉద్యోగుల భాగస్వామ్యంతో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 20 మంది పేద విద్యార్థుల ఎంబీబీఎస్‌ విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమణ్‌రెడ్డి ఎన్నికతో TRESA మరింత బలోపేతమవుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆయన అనుభవం, సమన్వయంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల పరిరక్షణలో సంఘం మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు, సంఘ నాయకులు రమణ్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments