టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం పూర్తీ చేసిన మహేష్ గౌడ్ తదుపరి అడుగులు ఎటు వైపు వేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. రెండో దఫా పీసీసీ చీఫ్ గా అధిష్టానం కొనసాగిస్తుందా లేదా మంత్రి గా అవకాశం ఇస్తుందా ?అనేది ఇంకా స్పష్టత రావడం లేదు.
పీసీసీ చీఫ్ గా రెండో దఫా కొనసాగించాలని మహేష్ ఇప్పటికే అధిష్ఠాన పెద్దలను కోరినట్లుగా సమాచారం.మంత్రి కంటే పెద్దదని తాను ఇదే పోస్టు వైపే మొగ్గు చూపుతానంటూ మహేష్ సన్నిహిత వర్గాల వద్ద చెప్తున్నారు కూడా ! గతంలో జిల్లాకు చెందిన డిఎస్ రెండు పర్యాయాలు రెండేళ్లుగా పైగానే పీసీసీ చీఫ్ గాపనిచేసారు.
కానీ ఒక్కసారి కూడా రెండేళ్లకు మించి కోన సాగలేదు.కానీ మహేష్ కు పార్టీ అధిష్టానం లో మంచి పట్టు ఉంది.కీలక నేతలకు సన్నిహితుడిగా వుంటూ వస్తున్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో వైయస్ డీఎస్ తరహాలోనే తాము కాంగ్రెస్ ను రెండో సారి అధికారం లోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నారు.
కానీ . సీఎం రేవంత్ రెడ్డి మహేష్ ల మధ్య విబేధాలు నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా మహేష్ పొడిగింపు ను రేవంత్ అడ్డుకునే ఛాన్స్ ఉందని పార్టీవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.అందుకే అధిష్టానం మహేష్ ను క్యాబినెట్ లోకి వెళ్లాలని ఒత్తిడి చేస్తుంది. ఎలాగో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అందులోనూ బీసీ సామాజికవర్గం కు చెందిన కొండా సురేఖ ను తొలగించినందున ఆమె స్థానంలో అదే సామాజికవర్గం కు చెందిన మహేష్ ను క్యాబినెట్ లోకి తీసుకోవాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది.
ఎలాగో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది అందుకే ఆ కొరత కూడా తీరుతుంది. ఎమ్మెల్సీ గా ఉన్న మహేష్ ను మంత్రిగా తీసుకొవడం లో ఎలాంటి ఇబ్బందులు వుండవు.
అసెంబ్లీ సమావేశాల తరవాత మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెపుతున్నారు విస్తరణ పక్రియ తరవాతే పీసీసీ చీఫ్ విషయంలో స్పష్టత వచ్చేలా ఉంది
