విద్యుత్ ఉద్యోగుల ఘన సన్మానంమాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కోర్ కమిటీ సభ్యుడిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నియమించిన సందర్భంగా రేణికుంట నాంపల్లిని విద్యుత్ శాఖకు చెందిన వివిధ యూనియన్లు, అసోసియేషన్ల నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రేణికుంట నాంపల్లి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆశీస్సులతో కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. తనపై నమ్మకంతో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కోర్ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్యను మరింత బలోపేతం చేయడంతో పాటు మాదిగ జాతితోపాటు అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మందకృష్ణ మాదిగ ఇచ్చే ప్రతి పిలుపునకు స్పందిస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో 1104 కంపెనీ అధ్యక్షుడు రఘునందన్, ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు గంగారం, శంకర్, నాగరాజు, వీవోటీ నాయకుడు శివాజీ, ఎస్టీ సంఘం నాయకులు చంద్రశేఖర్, వీరాజీ, మోతిలాల్, గంగాధర్, నాగభూషణం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
