HomeCRIMEఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి

ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి

నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పదోన్నతులు కల్పించారు. ఎ.గణేష్‌ (పీసీ–74) – టౌన్‌–2 పోలీస్‌స్టేషన్‌, నిజామాబాద్, అలాగే కే.వినోద్‌కుమార్‌ (పీసీ–605) – టౌన్‌–3 పోలీస్‌స్టేషన్‌ పదోన్నతి పొందారు.

వీరు బుధవారం పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు.కొంతకాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు హెడ్‌కానిస్టేబుల్‌ హోదా రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments