HomeHEALTHప్రభుత్వ వైద్య కళాశాలలో 83 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..

ప్రభుత్వ వైద్య కళాశాలలో 83 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..

ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్‌లో ఖాళీగా ఉన్న 83 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.ఈ మేరకు నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇందులో ప్రొఫెసర్‌–4, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–7, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–51, ట్యూటర్‌–15, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–6 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చని ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో కళాశాల కార్యాలయానికి హాజరు కావాలి.

పోస్టుల ఎంపికకు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, వేతనం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను “ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్‌ వెబ్‌సైట్‌” (https://reference-url-citation.invalid/0)లో పరిశీలించుకోవచ్చని కళాశాల అధికారులు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments