ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్లో ఖాళీగా ఉన్న 83 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.ఈ మేరకు నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇందులో ప్రొఫెసర్–4, అసోసియేట్ ప్రొఫెసర్–7, అసిస్టెంట్ ప్రొఫెసర్–51, ట్యూటర్–15, సివిల్ అసిస్టెంట్ సర్జన్–6 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చని ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో కళాశాల కార్యాలయానికి హాజరు కావాలి.
పోస్టుల ఎంపికకు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, వేతనం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను “ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ వెబ్సైట్” (https://reference-url-citation.invalid/0)లో పరిశీలించుకోవచ్చని కళాశాల అధికారులు సూచించారు.
