HomeDevotionalరక్తదానం.. ప్రాణదానంశ్రీ రాజరాజేశ్వరి యూత్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో 25 మంది యువకుల రక్తదానం..

రక్తదానం.. ప్రాణదానంశ్రీ రాజరాజేశ్వరి యూత్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో 25 మంది యువకుల రక్తదానం..

నగరంలోని ఎల్లమ్మగుట్టలో శ్రీ రాజరాజేశ్వరి యూత్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ‘రక్తదానం చేయండి.. ప్రాణదానం చేయండి’ అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 25 మంది యువకులు రక్తదానం చేశారు.

ఎస్‌బీ వాలంటరీ బ్లడ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. కార్యక్రమానికి నాలుగో టౌన్‌ ఎస్‌హెచ్‌వో సతీష్‌, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ పంచరెడ్డి లలితాచరణ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రక్తదాతలకు రక్తదాన ధ్రువపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారు తమను సంప్రదించాలని మండలి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో శేఖర్‌, రాజు, భరత్‌, సైఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments