HomeCRIMEఉపాధి కోసం వెళ్లిన వారికి.. మిలటరీ ఉచ్చు!

ఉపాధి కోసం వెళ్లిన వారికి.. మిలటరీ ఉచ్చు!

గార్డెన్‌ క్లీనర్లుగా తీసుకెళ్లి శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్‌ సరిహద్దుకు పంపుతున్నారని ఆరోపణ

ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నలుగురు మిలటరీలో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గార్డెన్‌ క్లీనర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రష్యాకు తీసుకెళ్లి.. అక్కడ మిలటరీ శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్‌ సరిహద్దుకు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు.వారిలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌కు చెందిన అఫ్టల్‌ ఖాన్‌ ఉన్నట్లు అతడి తమ్ముడు అంజద్‌ ఖాన్‌ తెలిపారు. గార్డెన్‌ క్లీనర్‌ ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లిన తన అన్నను అక్కడ మిలటరీలో చేర్చి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.అనంతరం ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతానికి పంపుతున్నారని, దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.

ఉద్యోగం కోసం వెళ్లిన వారిని మిలటరీలోకి తీసుకోవడం, యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి పంపే పరిస్థితి నెలకొనడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి రష్యాలో చిక్కుకున్న భారతీయుల వివరాలను సేకరించి, వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments