HomeCRIMEస్కూటీలే టార్గెట్‌.. ఎనిమిది వాహనాలు మాయం! గణేశ్‌ మండపం వద్ద స్కూటీ, స్పీకర్‌ చోరీ..మైలార్‌దేవ్‌పల్లిలో ఇద్దరు...

స్కూటీలే టార్గెట్‌.. ఎనిమిది వాహనాలు మాయం! గణేశ్‌ మండపం వద్ద స్కూటీ, స్పీకర్‌ చోరీ..మైలార్‌దేవ్‌పల్లిలో ఇద్దరు బాల నిందితుల అదుపులోకి..8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

హైదరాబాద్‌: ఇంటి ముందు పార్క్‌ చేసిన స్కూటీతోపాటు గణేశ్‌ మండపంలోని స్పీకర్‌ను అపహరించిన ఘటనలో ఇద్దరు బాల నిందితులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన వాహనాలతోపాటు మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

డీసీపీ ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి టీఎన్‌జీవోస్‌ కాలనీకి చెందిన రాహుల్‌రెడ్డి ఈ నెల 20న తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన యాక్టివా-125 (టీజీ-07-ఏహెచ్‌-9555)ను ఇంటి ముందు నిలిపారు. ఉదయం 9 గంటలకు లేచి చూడగా వాహనం కనిపించలేదు.

ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపంలోని స్పీకర్‌ కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ఇద్దరు బాల నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు 14–15 ఏళ్ల బాలుడు కాగా, మరొకరు 13 ఏళ్ల బాలుడు. ఇద్దరూ రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాలకు చెందినవారని పోలీసులు వెల్లడించారు.

బాల నిందితులు కావడంతో చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దర్యాప్తు డీసీపీ ఎస్‌.శ్రీనివాస్‌, ఏసీపీ ఎ.సుధాకర్‌ పర్యవేక్షణలో మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ సీహెచ్‌.శ్రీనివాస్‌, డీఐ మహ్మద్‌ మక్సూద్‌ అలీ, డీఎస్‌ఐ బి.వేణుగోపాల్‌, క్రైమ్‌ సిబ్బంది నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments