పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మంగళవారం టీఎన్జీవోస్ నేతలు కలిశారువివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై చర్చించి,వినతి పత్రం అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ , సెక్రటేరియట్ అధికారులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ వీరితోపాటు టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ ,జిల్లా ఉపాధ్యక్షులు సంజీవయ్య ,జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్,ఏ ఓ వినయ్ కుమార్ గారు మరియు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కడారి జనార్ధన్, సామ్యూల్ వెస్లీ తదితరులు హాజరైనారు.
