పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న 7 లైన్లు, మెయిన్ రోడ్ అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ బస్తీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్తీవాసులు గత వారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
బస్తీవాసుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులను పనులు ప్రారంభించేలా ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఏఈ వెంకటేష్ శనివారం పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో పర్యటించి పెండింగ్‌లో ఉన్న పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పెండింగ్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఏఈ వెంకటేష్ బస్తీవాసులకు తెలిపారు.అలాగే నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించి స్థానిక రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ (NOC) వచ్చిన వెంటనే కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.పెండింగ్ పనులు త్వరలో ప్రారంభం కానుండటంతో బస్తీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
