HomeCRIMEకల్పోల్ అటవీ ప్రాంతంలో చిరుత కలకలంఅప్రమత్తమైన అటవీ అధికారులు

కల్పోల్ అటవీ ప్రాంతంలో చిరుత కలకలంఅప్రమత్తమైన అటవీ అధికారులు

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని కల్పోల్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు స్థానికుల కంటపడటంతో వారు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అప్రమత్తమై చిరుత కదలికలపై నిఘా పెట్టారు.

చిరుత సంచరిస్తున్న ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, పశువులను అడవికి సమీపంలో మేపేందుకు తీసుకెళ్లవద్దని హెచ్చరించారు.

చిరుతను పట్టుకునేందుకు లేదా తరిమేందుకు ఎవరూ ప్రయత్నించకుండా, దాని కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments