HomeCRIMEపాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

నాదర్‌గుల్‌ సమీపంలోని కమ్మగూడ సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం పద్ర గ్రామానికి చెందిన రాజేష్‌ పాఠశాలలోనే ఉంటూ చదువుకుంటున్నాడు.బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో రాజేష్‌ వాష్‌రూమ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడినట్లు తోటి విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. దీంతో యాజమాన్యం వెంటనే అతడిని నాదర్‌గుల్‌లోని ప్రతూష ఆస్పత్రికి తరలించింది.

అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓవైసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments