HomeCRIMEధాన్యం అక్రమ తరలింపునకు తావివ్వొద్దురైతులు, వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యం రైస్‌ మిల్లర్లకు సీపీ సాయి చైతన్య...

ధాన్యం అక్రమ తరలింపునకు తావివ్వొద్దురైతులు, వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యం రైస్‌ మిల్లర్లకు సీపీ సాయి చైతన్య సూచన

ధాన్యం కొనుగోళ్లు, విక్రయాల్లో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య రైస్‌ మిల్లర్లకు సూచించారు. ధాన్యాన్ని అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు తరలించడం, కృత్రిమ కొరత సృష్టించే చర్యలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు.

శుక్రవారం నిజామాబాద్‌లో రైస్‌ మిల్లుల అసోసియేషన్‌ ప్రతినిధులు, మిల్లర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుని పంటల సాగు, దిగుబడులపై ప్రభావం పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, రవాణా, విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలు, ధరల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

ప్రజలకు బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలని, ధరల భారం సామాన్యులపై పడకుండా సహకరించాలని కోరారు.రైతుల కష్టానికి తగిన ప్రాధాన్యం ఇస్తూనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు.

ధాన్యం, బియ్యం సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.సమావేశంలో అదనపు డీసీపీ ఎన్‌. శుభం ప్రకాష్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం. శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌ బి. ప్రవీణ్‌, ఏసీపీ ప్రకాష్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశం, రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మోహన్‌రెడ్డి, మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments