ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కాలు జారి కిందపడి, కాలు విరిగి బాధపడుతున్న వృద్ధుడికి ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ కాలనీకి చెందిన దారం గుల నారాయణ (65) తనను ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని, ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాలంటూ పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో నారాయణకు కాలుకు గాయమై, విరిగినట్లు తెలిపారు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయించినా తగిన వైద్య సేవలు అందడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పలుమార్లు తన బాధను చెప్పుకున్నా స్పందించడం లేదని, మరో ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారని వాపోయారు. తనకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
