HomeCRIMEరైల్వే స్టేషన్‌లో మొబైల్‌ దొంగ అరెస్టు!

రైల్వే స్టేషన్‌లో మొబైల్‌ దొంగ అరెస్టు!

ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనంగతంలోనూ నిందితుడిపై కేసురైల్వే స్టేషన్‌లో ప్రయాణికులే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని రైల్వే పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు.

రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం నంబరు–1పై సోమవారం ఉదయం 8.30 గంటలకు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముజాహిద్‌నగర్‌కు చెందిన క్వమ్మరుద్దీన్‌ షేక్‌ (37) అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు.

క్రైం నంబరు 188/2026, బీఎన్‌ఎస్‌ 305(సి) సెక్షన్‌ కింద నమోదైన మొబైల్‌ చోరీ కేసులో అతడి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇతడిపై ఇదే సెక్షన్‌ కింద మరో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.

నిందితుడి నుంచి సుమారు రూ.16 వేల విలువైన రియల్‌మీ 14టీ ఫోన్‌తో పాటు శామ్‌సంగ్‌ జే7 మ్యాక్స్‌, శామ్‌సంగ్‌ ఏ35, వివో వై20, రెడ్‌మీ నోట్‌ 13, వివో వై71 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరు ఫోన్లను సీజ్‌ చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments