HomeDevotionalగాయత్రి హిల్స్‌లో భక్తిశ్రద్ధలతో అన్నదానం

గాయత్రి హిల్స్‌లో భక్తిశ్రద్ధలతో అన్నదానం

జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని గాయత్రి హిల్స్ కాలనీలో శనివారం కాలనీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు పి.విజయారెడ్డి, మోహన్‌యాదవ్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వాహకులను, కాలనీ ప్రతినిధులను పరామర్శించిన వారు, ప్రజలకు ఆహారం అందించేలా ఇటువంటి సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.

సేవ దృక్పథంతో పనిచేస్తున్న ప్రతినిధులకు అన్ని వేళలా అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రాఘవులుతో పాటు ప్రతినిధులు శ్రీనివాస్, మధు, ఇతర సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments