HomeCRIMEమద్యానికి బానిసై రైలు కింద పడి యువకుడు బలన్మరణం...

మద్యానికి బానిసై రైలు కింద పడి యువకుడు బలన్మరణం…

మద్యానికి బానిసై రైలు కింద పడి యువకుడు బలన్మరణం చేసుకున్న ఘటన నిజామాబాద్ రైల్వే పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

నగరంలోని చంద్రశేఖర్ కాలానికి చెందిన మహమ్మద్ షకీల్(30).

మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది.వృతి రీత్యా లారి డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.వచ్చిన డబ్బుతో మద్యానికి బానిసై తరుచుగా తాగేవారు.

ఈక్రమంలో మంగళవారం మద్యం సేవించి ఇంటికి రాగా తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లి మడవనగర్ దగ్గర గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments